మోడల్ స్కూల్ రిక్రూట్‌మెంట్‌కు బ్రేక్!
-కేవలం సగం పోస్టులు మాత్రమే భర్తీ
-మొదటి మెరిట్ జాబితాతోనే సరిపెట్టనున్న అధికారులు -రాష్ట్ర విభజన నేపథ్యంలో మిగతాపోస్టులు భర్తీకి అధికారుల వెనుకంజ హైదరాబాద్, మార్చి 14 (టీ మీడియా): రాష్ట్ర విభజన నేపథ్యంలో మోడల్ స్కూల్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాధికారులు బ్రేక్ వేశారు. మోడల్ స్కూల్‌పోస్టులు జోనల్ స్థాయివి కావటంతో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెదటి జాబితాలో ఎంపికైన అభ్యర్థులతోనే సరిపెట్టాలని భావిస్తున్నారు. మిగతా పోస్టులకు రెండురాష్ర్టాలు ఏర్పాటయ్యాక భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. 2013-14 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 355 మోడల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి 2012 లో పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం 7100 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష నిర్వహించి మొదటిదఫా మెరిట్‌లిస్టును రూపొందించి భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. ఇందు లో 355 ప్రిన్సిపాల్ పోస్టులకుగానూ 184 భర్తీ అయ్యాయి. 4615 పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్లకుగానూ 2500 మందిని, 2130 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకుగానూ 960 మందిని భర్తీ చేశారు. మోడల్ సొసైటీ పేర్కొన్న విద్యార్హతలు లేకపోవటంతో మొదటి మెరిట్ లిస్టులో అందరూ ఉద్యోగాలకు ఎంపిక కాలేక పోయా రు. ఇప్పటికే ప్రభుత్వ టీచర్లుగా కొనసాగుతున్న ఉపాధ్యాయులకు కూడా పేప్రొటక్షన్ ఇవ్వని కారణంగా చాలా మంది ఉద్యోగాన్ని తిరస్కరించారు. దీంతో అన్ని కేటగిరీల్లో సగానికి సగం పోస్టులు భర్తీ కాలేదు. దీంతో రెండో దఫా మెరిట్ లిస్టు తయారు చేసి మిగతా పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావించినప్పటికీ, రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావటం అధికారు లు వెనుకంజ వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 355 మోడ ల్ స్కూళ్లలోని టీజీటీ, పీజీటీ పోస్టులు జోనల్ పోస్టు లు. 30 శాతం ఓపెన్ మెరిట్( ఏ ప్రాంతం వారైనా ఎంపిక కావచ్చు) ద్వారా, 70 శాతం ఆయా జోన్లలోని జిల్లాల అభ్యర్థులతో భర్తీ చేస్తారు. ప్రిన్సిపాల్ పోస్టులు మాత్రం స్టేట్ కేడర్ పోస్టులుగా ఎంపిక చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జోనల్ పోస్టులు భర్తీ చేస్తే ఇరు ప్రాంతాల అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు సెకండ్ మెరిట్ జాబితాను రూపొందించేందుకు సిద్ధంగా లేరు. అయితే ప్రస్తుతం టీజీటీ పోస్టుల కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మిగతా టీజీటీ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయ అధికారులు అంటున్నారు. సెకండ్ మెరిట్ లిస్టు తయారీకి ప్రభుత్వ అనుమతి కోసం మోడల్ స్కూల్ సొసైటీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ అనుమతి రాగానే టీజీటీ పోస్టులకు సెకండ్ మెరిట్ లిస్టు తయారు చేస్తామని చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుమతి ఇచ్చే అవకాశం లేదని పాఠశాల విద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. టీజీటీ పోస్టుల అంశం పక్కన పెడితే మిగతా పోస్టులకు మాత్రం సెకండ్ మెరిట్ లిస్టు దాదాపుగా లేనట్లే అని చెప్పాలి. జూన్ 2తో సాంకేతికంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన పరీక్ష మెరిట్ జాబితాలను అంగీకరించే అవకాశం లేదు. ప్రస్తుతం భర్తీ కాగా మిగిలిన పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం లేకపోలేదని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. |
Pages
- Home
- SSC-2016 INSTRUCTIONS
- G.O.No:17 OF APMS ADD
- apms offcial website
- DEO KURNOOL
- AP GOVT GO'S
- RMSA-Andhra Pradesh
- Leaves in APMS
- NCERT TEXT BOOKS
- BOI LOGIN FORM
- BOI WEB
- INCOME TAX SOFTWARE
- APS RTC
- Teachers useful info
- EENADU CHADUVU
- Tracking Add-2014-15
- Sakshi Education
- ONLINE SBI
- EPASS SCHOLARSHIP
- MANA BADI
- SCHOOLS9
- APMS GOSPADU
- APMS RUDRAVARAM
- Science Projects
- CCE MODEL PAPERS
Tuesday, 18 March 2014
మోడల్ స్కూల్ రిక్రూట్‌మెంట్‌కు బ్రేక్!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment