Monday, 24 March 2014

టెన్త్‌ పరీక్షల వాయిదాకు సిద్ధంగా ఉండాలి

* రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌

ఈనాడు – హైదరాబాద్‌: ఏప్రిల్ ఎనిమిదిన ఎన్నికలు జరపాల్సి వస్తే ఏప్రిల్‌ ఏడు, తొమ్మిదో తేదీల్లో జరగాల్సిన పదోతరగతి పరీక్షలను వాయిదా వేయడానికి సిద్ధంగా ఉండాలని విద్యాశాఖను ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ మార్చి 21న తెలిపారు. మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యుల్‌లో మార్పులు చేస్తామన్నారు. ప్రస్తుతానికి ఏప్రిల్‌ ఆరో తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు షెడ్యులు విడుదల చేసినా రెండు దశల్లో ఎన్నికలు జరపడానికి వీలుగా ఆరు, ఎనిమిదో తేదీల్లో ఎన్నికలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరామన్నారు.

No comments:

Post a Comment